వెనుజుల విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి దక్కిన విషయం తెలిసిందే. ఈరోజు నార్వేలో నోబెల్ పురస్కార ప్రదానోత్సవం జరగనుంది. అయితే, ఈ కార్యక్రమానికి ముందు ఓస్లోలో నిర్వహించే మీడియా సమావేశానికి మరియా గైర్హాజరు అయినట్లు సమాచారం. కాగా, అజ్ఞాతంలో ఉన్న ఆమె దేశం దాటి బయటకు వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఇప్పటికే వెనుజుల అటార్నీ జనరల్ వెల్లడించారు.