ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత పంచాయతీ పోలింగ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు అమలు చేస్తున్నారు. ఆయుధాల స్వాధీనం, రౌడీషీటర్ల బైండోవర్తో పాటు గ్రామాల్లో పోలీస్ కవాతులు నిర్వహించారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు 1,800 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. ప్రధాన మార్గాల్లో చెకోపోస్టులు ఏర్పాటు చేసి నగదు తరలింపుపై నిఘా పెంచారు.