MDK: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నార్సింగి మండలంలోని అభ్యర్థులు, రాజకీయ నాయకులు ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని ఎస్సై సృజన సూచించారు. ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు.