బాపట్ల: జిల్లాలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ఆదివారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 21.2 లక్షల విలువైన 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజుల్లో జిల్లా పోలీసులు రూ.40 లక్షల విలువైన 60 బైకులను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ తెలిపారు. దొంగలను పట్టుకున్న పోలీసు సిబ్బందిని అభినందించారు.