ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామం సెంటర్లో పీడీఎస్ బియ్యంను తరలించుచుండగా పట్టుకున్నారు. 50 కేజీల బరువు గల మొత్తం 4,000 కేజీలు పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు మండల సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ కే. శేషగిరిరావు ఇవాళ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పనులు మళ్లి ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఆయన హెచ్చరించారు.