ATP: ఆత్మకూరు మండలం పంపనూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.30 లక్షల స్వచ్ఛభారత్ నిధులతో 22 శౌచాలయాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పల్లకి సేవలో పాల్గొన్నారు. రూ.14.20 కోట్లతో దేవస్థానం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.