PDPL: JEE MAINS 2026కి రికార్డు స్థాయిలో అప్లికేషన్లు పెరిగాయి. జేఈఈ మెయిన్స్ 1 పరీక్షకి 14.5 లక్షల విధ్యార్థులు దరఖాస్తు చేసుకోగా, గత సంవత్సరంతో పోలిస్తే 1.4 లక్షల అధికం. కాగా, ఈ పరీక్షలు 2026 జనవరి 21-30 తారీఖున జరగనున్నాయి. ఈ సారి తెలంగాణలో కొత్తగా ఆదిలాబాద్, పెద్దపల్లి, కోదాడల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ వెల్లడించింది.