ADB: బోథ్ గ్రామపంచాయతీలోని నామినేషన్ కేంద్రాన్ని ఇవాళ ఎంపీడీవో రమేష్ సందర్శించారు. అభ్యర్థుల ఉపసంహరణపై అలాగే, పోటీ చేయు అభ్యర్థుల లిస్ట్‌ను పరిశీలించారు. అభ్యర్థులకు నామినేషన్ పత్రంలో పేర్కొన్న విధముగా తెలుగు వర్ణమాల ప్రకారం గుర్తుల కేటాయింపును ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని సూచించారు. ఆర్వో వేణు, ఏఆర్వో సత్యనారాయణ, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.