పలాష్‌తో తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు స్మృతి మంధాన ప్రకటించింది. ‘కొన్ని వారాలుగా నాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో నా పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని క్లారిటీ ఇస్తున్నా. అంతా ఇక్కడితో వదిలేస్తున్నా. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని ప్రార్థిస్తున్నా. నా దేశానికి ఎన్నో ట్రోఫీలు అందించాలని కోరుకుంటున్నా, దానిపైనే నా ఫోకస్ అంతా’ అంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టింది.