ASR: చాపరాయి జలపాతం ఆదివారం సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో పర్యాటకులు చేరుకుని జలపాతంలో స్నానాలు చేస్తూ, కేరింతలు కొడుతూ సందడి చేశారు. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ కొందరు గిరిజన సాంప్రదాయ వస్త్రధారణలో ఫొటోలకు ఫోజులిస్తున్నారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా స్థానిక పోలీసులు చర్యలు చేపట్టారు.