SDPT: శాసన సభ నిబంధనలను పాటించకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖలో విమర్శించారు. రెండేళ్లయినా హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని నిర్లక్ష్యం చేయడం, ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు.