MDK: ఏడుపాయల వన దుర్గామాత ఆలయంలో ప్రతి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నీటి లోతు తెలియక ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉండగా, QRT సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ.. అనేక ప్రమాదాలను నివారించామని అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు.