KNR: కరీంనగర్లో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా శనివారం తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు సరైన నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ తనిఖీలలో మొత్తం 73 వాహనాలను గుర్తించి, వాటి యజమానులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానా విధించారు. రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు.