అన్నమయ్య: సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ఆరోపణలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత వైసీపీ పాలనలో భూ సమస్యలు పెరిగాయని విమర్శించారు. భూ ఆక్రమణలు నిజమైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.