TPT: వాకాడు మండలం పరిధిలోని వాకాడు నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి విగ్రహం సర్కిల్ వద్ద అధిక లోడుతో వెళుతున్న వడ్ల లారీకి తృటిలో ప్రమాదం తప్పింది. లారీ ఒకవైపుకు ఒరిగి అందులో బస్తాలు క్రిందకు పడ్డాయి. వేయవలసిన లోడు కంటే అధికంగా వేయడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఎవరికీ ఏం జరగకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.