AP CID Petition Vijayawada ACB Court For Chandrbabu Home foreclosure
Chandrbabu Home foreclosure: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrbabu) ఇల్లు జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయి. ఉండవల్లిలో కరకట్ట రోడ్డు సమీపంలో ఇంటిని జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిస్తూ సీఐడీకి (CID) ఉత్తర్వులు జారీచేసింది. అందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ (CID) ఏసీబీ కోర్టును (acb court) ఆశ్రయించింది.
కరకట్ట రోడ్డు సమీపంలో లింగమనేని రమేష్‌కు చెందిన ఇంట్లో చంద్రబాబు నాయుడు (Chandrbabu) ఉంటున్నారు. అమరావతి నగర బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రిండ్ రోడ్ ఎలైన్ మెంట్, కంతేరు, కాజ, నంబూరు గ్రామాల ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికల ద్వారా లింగమనేని రమేశ్ ఆస్తులు, భూములు విలువ పెరగడానికి చంద్రబాబు (Chandrbabu) హెల్ప్ చేశారు. రమేశ్‌కు (ramesh) లబ్ధి కలిగించారని సీబీఐ అభియోగం మోపింది.
లంచం, క్విడ్ ప్రోకో కింద లింగమనేని రమేష్ తన ఇంటిని చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చారని సీబీఐ అంటోంది. ఆ ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. సీఐడీ పిటిషన్‌పై నిన్న కూడా విచారణ జరిగింది. జప్తునకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఈ రోజు ఆ పిటిషన్ విచారణ కొనసాగుతోంది.