KMR: త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం (EVM) గోదాంను తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి గోదాంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు భద్రతా నిబంధనల అమలు గురించి అధికారులను అడిగారు.