W.G: మంచినీళ్లు అనుకుని పొరపాటున పురుగుల మందు తాగి వ్యక్తి చనిపోయిన ఘటన పాలకోడేరు (M) మొగల్తూరులో చోటుచేసుకుంది. ఆదిరెడ్డి దుర్గారావు(43) భీమవరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. గత నెల 30 రాత్రి తీవ్రమైన తలనొప్పి రావడంతో చీకట్లో మంచినీళ్లు అనుకుని పురుగులు మందు తాగారు. దుర్గారావును ఏలూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.