MNCL: పశువులలో వ్యాధులు నివారణకు యజమానులు, రైతులు తప్పకుండా టీకాలు వేయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. దండేపల్లి మండలంలోని కొరవిచెల్మ గ్రామ పశు వైద్య కేంద్రం ఆవరణలో ఏర్పాటుచేసిన గాలికుంటు వ్యాధి నివారణ పశు వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయం తర్వాత పశువులతోనే ఆదాయం వస్తుందన్నారు.