ADB: ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని DIEO జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. మొత్తం 8,520 మంది విద్యార్థులకు గాను 8,135 మంది హాజరయ్యారని డీఐఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 292 మంది, ఒకేషనల్ విభాగంలో 93 మంది కలిపి మొత్తం 385 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.