W.G: పాలకొల్లు నియోజకవర్గంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు అండగా నిలుస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం భారీగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఒకేరోజు 95 మంది లబ్ధిదారులకు రూ. 55 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. గత 18 నెలల్లో పాలకొల్లు నుంచి రూ.12 కోట్ల ఆర్థిక సాయం అందించామని, కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.