సత్యసాయి: బీజేపీ యువ మోర్చా జిల్లా కోశాధికారిగా అమరాపురం(మం) ఆలదపల్లికి చెందిన రంగనాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిల్లు కుళ్లాయప్ప యాదవ్ అధికారికంగా నియామకాన్ని ప్రకటించారు. మంగళవారం రంగనాథ్ మాట్లాడుతూ.. తనను నమ్మి పదవి అప్పగించినందుకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.