NLG: నకిరేకల్ పట్టణంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన 8వ విడత ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆర్థికాభివృద్ధిలో పశువుల ఆరోగ్యం కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత టీకాలను పశుపోషకులందరూ సద్వినియోగం చేసుకుని పశు సంపదను కాపాడుకోవాలని సూచించారు.