ATP: విజయవాడలో డాక్టర్ దీపిక ఆత్మహత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె మృతికి కారణమైన అమర్‌ను అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన దీపికను ప్రేమించి, మరో యువతితో పెళ్లికి సిద్ధమవ్వడంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఇటీవల ఇంజెక్షన్ తీసుకుని ఆమె తనువు చాలించింది. నందిగామలో ప్రభుత్వ డాక్టరుగా పనిచేస్తున్న అమర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.