పల్నాడు: వరుసకు అన్నగా ఉండే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డ ఘటన నరసరావుపేటలో జరిగింది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని రత్నరాజు అనే యువకుడు పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా ఒత్తిడి చేస్తూ వేధించాడని సమాచారం. వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.