KMM: వైరాలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అధ్యక్షతన మండల అధికారులు, సర్పంచులు, ఉపసర్పంచుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.