GDWL: మానవపాడు- పోతులపాడు రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే కానిస్టేబుల్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. 55-60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి ప్రయాణిస్తున్న రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తెల్ల చొక్కా, బ్లూ షార్ట్, బ్లూ చెక్స్ లుంగీ ధరించి ఉన్నట్లు తెలిపారు.