SRPT: అనంతగిరి మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ వాహనం రాకముందే గ్రామాల్లో సిలిండర్లతో క్యూలో కనిపిస్తున్నారు. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల సరఫరాలో జాప్యం జరుగుతోందని వ్యాపారులు చెబుతుండటంతో మహిళలు గంటల తరబడి వేచి చూడాల్సివస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.