తాను తన ఫ్యామిలీకి, పుట్టబోయే బిడ్డ కోసం తగిన సమయాన్ని కేటాయించడానికి యాక్టింగ్‌కు గుడ్ బై(Goodbye to Acting) చెబుతున్నట్లు బుల్లితెర నటి దీపిక కక్కర్ తెలిపారు.
బాలీవుడ్(Bollywood) బుల్లితెర నటి దీపికా కక్కర్(Dipika kakar) యాక్టింగ్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను గర్భవతి(Pregnent)నని తెలిపారు. ఈ సమయంలో తాను తన ఫ్యామిలీకి, పుట్టబోయే బిడ్డ కోసం తగిన సమయాన్ని కేటాయించడానికి యాక్టింగ్‌కు గుడ్ బై(Goodbye to Acting) చెబుతున్నట్లు తెలిపారు.
‘ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్నాను. తల్లి కాబోతున్నానన్న ఫీలింగ్ చాలా బాగుంది. పెళ్లయ్యాక ఐదేళ్ల తర్వాత మేం అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందుతున్నాం. ఈ ఎగ్జయిట్మెంట్ నెక్ట్స్ లెవల్లో నాకిప్పుడు ఉంది. చిన్నవయసులోనే నేను కెమెరా ముందు మేకప్ వేసుకున్నాను. 15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగాను. నా ప్రెగ్నెన్సీ ప్రయాణం మొదలవగానే షోయబ్‌కి చెప్పా. నాకు పని చేయడం ఇష్టం లేదని. నటనకు స్వస్తి చెప్పి గృహిణిగా, తల్లిగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా’ అని దీపిక తెలుపుతూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతోంది. ఆమె పోస్టుకు చాలా మంది మంచి నిర్ణయం తీసుకుంటున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.