VZM: కొత్తవలస-అరకు ప్రధాన రహదారి మంగళపాలెం శివాలయం వద్ద సోమవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు క్షతగాత్రులను పెందుర్తి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.