కరీంనగర్లోని పలు ఆలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవాలు వైభవంగా కొనసాగాయి. నగరంలోని బోయవాడలో అశ్వత్త నాగేంద్రుడి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి దేవసేనల కళ్యాణోత్సవం కన్నులపండువగా కొనసాగింది. ఆలయ కమిటీ ప్రతినిథి కన్న క్రిష్ణ సమక్షంలో వేడుకలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు.