ADB: వైద్యుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక గర్భిణుల మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత మూడు నెలల్లో సిరికొండలో ఏత్మబాయి, ఇచ్చోడలో అనురాధ, గుడిహత్నూర్లో రుక్మాబాయి, ఆమె బిడ్డ, రోడ్డు, సిగ్నల్ సరిగా లేక సోమవారం ఉట్నూర్లో జంగుబాయి, ఆమె బిడ్డ మృతి చెందారు.