ATP: జిల్లాలో రెండు ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 10 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు డిసెంబరు 10 వరకు పొడిగించినట్లు డీఈఓ ప్రసాద్ బాబు బుధవారం తెలిపారు. జిల్లాలో సెయింట్ మెరీ బాలికల ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (అనంతపురం)లో ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ తెలుగు, ఎల్సెట్ తెలుగు, ఎల్పీటీ హిందీ పోస్టులు ఉన్నాయన్నారు.