ప్రకాశం: కొమరోలు మండలంలో ఆర్ డి ఎస్ ఎస్ పనులు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లుగా ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని రెడ్డిచర్ల, మూలపల్లె, మల్లారెడ్డి పల్లె, మిట్టమీది పల్లె, బ్రాహ్మణపల్లె, గోనెపల్లె, మదవపల్లె, ఎర్రగుంట్ల, వట్టి వేపమాను పల్లె గ్రామాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు.