NGKL: కల్వకుర్తిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు బుధవారం ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. వెంకటేష్‌కు మూడు రోజులు, ఆకాష్ చారి, సంతోష్ రెడ్డిలకు రెండేసి రోజుల చొప్పున జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 500 జరిమానా విధించింది. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై వివరించారు.