మెదక్: పాపన్నపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ సహా పలు అంశాలపై తహాసీల్దార్, ఎంపీడీవో, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేలా అన్ని జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.