అమెరికాలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన బాస్ ప్రాణాలు కాపాడేందుకు కిడ్నీ దానం చేసిన మహిళను.. కోలుకోవడానికి ఎక్కువ సెలవులు పెట్టిందనే సాకుతో సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. 2012లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణం పోసిన మనిషి పట్ల ఇంత కర్కోటకంగా వ్యవహరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించింది.