TG: పరిశ్రమల భూ బదలాయింపుపై BRS నేతలు చర్చకు సిద్ధమా అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అని సవాల్ విసిరారు. గతంలో కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టిన వారికి.. తమ ప్రభుత్వం తెచ్చిన పాలసీ వర్తిస్తుందన్నారు. లీజ్ భూములకు ఫీజు వసూలు చేసింది బీఆర్ఎస్ నేతలే అని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.