పాకిస్తాన్లో పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తల ఆందోళనలతో పరిస్థితులు అదుపు తప్పాయి. నిరసనకారులపై లాఠీఛార్జ్ జరుగుతుండగా.. పాక్ ఆర్మీ చీఫ్ అత్యవసర భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే, జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను పాక్ సైన్యం హత్య చేసిందని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ ఆరోపించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిపై పాక్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.