ATP: రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డి బొమ్మనహాల్ మండలం గోనెహాల్ వద్ద నష్టపోయిన అరటి తోటలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, కూటమి ప్రభుత్వానికి రైతులపై ప్రేమ, కరుణ లేదన్నారు. రైతుల ఉసురు చంద్రబాబు నాయుడుకు తగలకుండా పోదని తీవ్రస్థాయిలో విమర్శించారు.