హాంగ్‌కాంగ్‌లోని తైపో జిల్లాలో ఓ హైరైజ్ నివాస సముదాయంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ బిల్డింగ్‌లో సుమారు 2000 మంది నివసిస్తుండగా.. వందల మంది మంటల్లో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మంటల ధాటికి లోపల ఉన్నవారు భయంతో వణికిపోతున్నారు. మిగిలిన వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది.