ADB: ప్రపంచానికే ఆదర్శం భారత రాజ్యాంగం అని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం ఉట్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు డా . బీఆర్.అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.