SKLM: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాల (పురుషులు) ప్రిన్సిపల్ జి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కళాశాలలో బుధవారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంవిధాన్ దివాస్‌గా, జాతీయ న్యాయ దినోత్సవంగా పరిగణిస్తారన్నారు.