కరీంనగర్లోని తెలంగాణ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల బాలుర-3లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. ప్రధానోపాధ్యాయులు భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం, ప్రాముఖ్యత, దేశ ప్రగతిలో దాని పాత్రపై అవగాహన సదస్సు నిర్వహించి, దేశ నిర్మాణం, హక్కులు, బాధ్యతలను వివరించారు.