MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.