SRPT: సూర్యాపేట నుంచి ఖమ్మం వైపుగా వెళ్తున్న బైక్ను అతివేగంతో వచ్చిన కారు ఢీకొన్న ఘటన మోతె మండలం హుస్సేనాబాద్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుడకుడకి చెందిన ఒక వ్యక్తి మంగళవారం రాత్రి బైక్ పై శుభకార్యానికి ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు.