NLG: ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నిన్న సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.. ఎంపీడీవోలు, ఎంపీవోలు, పోలింగ్ కేంద్రాలు పరిశీలించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.