MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1539 మంది మహిళా సంఘం సభ్యురాళ్లకు రూ.1,84,39,513 కోట్ల వడ్డీ లేని రుణాన్ని పంపిణీ చేశారు. ఈ రుణాల ద్వారా వ్యాపారం చేసి మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు.