ADB: 2010 అక్టోబర్ 23కు ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ (టెట్) మినహాయింపు ఇవ్వాలని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం కోరారు. సోమవారం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్‌ను టీయూటీఎఫ్ నేతలతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగ విరమణకు ముందు 5 సంవత్సరాల సర్వీసు కలిగిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనడం సరికాదన్నారు.