MDK: శివంపేట మండలం పోతులబోగూడ గ్రామానికి చెందిన కుమ్మరి సాయి (21) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హైడ్రాలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న సాయి శనివారం మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.